: పాలేరులోనూ కారుదే హవా: కేటీఆర్
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నిక విజయంపై పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో నమ్మకంతో ఉన్నట్టున్నారు. పాలేరులోనూ తమదే విజయమని ఆయన తేల్చి చెప్పారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు మరో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తదితరులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే పాలేరులో టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు నైతికంగా చనిపోయాయని వ్యాఖ్యానించారు. ముమ్మాటికీ పాలేరులో గెలుపు కారుదేనన్నారు.