: స్టాక్ మార్కెట్ సమాచారం... స్వల్ప నష్టాలలో దేశీయ మార్కెట్లు


అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో, మన స్టాక్ మార్కెట్లు ఈ రోజు నిస్తేజంగా సాగి ఫ్లాట్ గా ముగిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 25228 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు పాయింట్ల నష్టంతో 7733 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. కాగా, ఈ రోజు ఎన్ఎస్ఈలో గెయిల్ సంస్థ షేర్లు అత్యధికంగా 4.88 శాతం లాభంతో రూ. 383.60 వద్దకు చేరాయి. అలాగే, ఐషర్ మోటార్స్, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి. ఇక బాగా నష్టపోయిన షేర్లలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ షేర్లు వున్నాయి. ఇవి 2.31 శాతం నష్టంతో రూ. 2861.95 వద్దకు చేరాయి. అలాగే, విప్రో, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల షేర్లు కూడా ఈ రోజు నష్టాల బాట పట్టాయి.

  • Loading...

More Telugu News