: ‘పాలమూరు’పై సుప్రీం గడప తొక్కిన ఏపీ రైతులు... తెలంగాణ సర్కారుకు నోటీసులు
తెలంగాణ సర్కారు కట్టి తీరుతానంటున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ ప్రాజెక్టులపై నిన్నటిదాకా ఏపీ, తెలంగాణ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలితే... తాజాగా ఏపీ రైతులు రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వం కట్టి తీరుతామంటున్న ఆ రెండు ప్రాజెక్టుల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తూ ఏపీకి చెందిన కొంతమంది రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.