: జంపింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్కిచ్చిన సుప్రీంకోర్టు!


ఓ పార్టీ టికెట్ పై విజయం సాధించి... ఆ తర్వాత పార్టీ జెండా మార్చేసే ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా మారిన ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ లో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కును రద్దు చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం కేంద్రంలో అదికార పార్టీ బీజేపీకి కూడా మొట్టికాయేనని చెప్పొచ్చు. కోర్టు నిర్ణయం ప్రకారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొన్నటిదాకా కాంగ్రెస్ సభ్యులుగానే ఉండి తాజాాగా బీజేపీ పంచన చేరిన 9 మంది ఎమ్మెల్యేలకు బలపరీక్షలో ఓటు హక్కుండదు. ఈ తీర్పు భవిష్యత్తు లో గోడ దూకే ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరికగానే మారుతుందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News