: అంతా ఒట్టిదే... హిందాన్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించలేదట!... అదంతా మాక్ డ్రిల్లేనట!
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల మెరుపు దాడి తరహాలోనే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాదులోని హిందాన్ ఎయిర్ బేస్ లోకి కూడా నిన్న రాత్రి ఉగ్రవాదులు చొచ్చుకెళ్లారన్న వార్తలు పెను కలకలం రేపాయి. జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హిందాన్ ఎయిర్ బేస్ లోకి ఎంటరయ్యారన్న సమాచారంతో ఎయిర్ బేస్ భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారన్న వార్తలు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. అయితే ఈ విషయంలో ఏమాత్రం భయాందోళన చెందాల్సిన అసవరం లేదని భద్రతా సిబ్బంది ఆ తర్వాత తాపీగా చెప్పారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడికి దిగితే... మన సన్నద్ధత ఏ మేరకు ఉందన్న అంశాన్ని పరిశీలించుకునేందుకు స్వయంగా భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారట. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారన్న ప్రచారం పుట్టించి ఆ తర్వాత ఎయిర్ బేస్ లో ఉత్తుత్తి సోదాలు చేశారట.