: మెట్టు దిగిన కేంద్రం!... ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమేనని ప్రకటన
న్యాయస్థానాల ముందు నరేంద్ర మోదీ సర్కారు తలొగ్గక తప్పలేదు. ఉత్తరాఖండ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసుకున్న కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది. ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పుతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కోర్టుల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో కేంద్రం చివరకు మెట్టు దిగక తప్పలేదు. ఉత్తరాఖండ్ లో హారీశ్ రావత్ సర్కారు బల పరీక్షకు సిద్ధమేనని ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్రం... సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో త్వరలోనే ఉత్తరాఖండ్ లో హరీశ్ రావత్ తన బలాన్ని నిరూపించుకునే అవకాశం లభించినట్లైంది.