: భారతీయ మార్కెట్లో 32 జిబి గూగుల్ నెక్సస్ 7
ట్యాబ్లెట్‌ల ప్రపంచంలో సంచలనంగా నిలుస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ నెక్సస్ 7ఇప్పుడు 32 జిబీ సామర్థ్యంతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. టెలికాం టైగర్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. 10.45 ఎంఎం ఉండే ఈ ట్యాబ్లెట్ 340 గ్రాముల బరువుంటుంది. ఇందులో 4.2 జెల్లీబీన్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ వాడారు.
బ్లూటూత్ వంటి సదుపాయాలు ఉండనే ఉంటాయి. భారత్‌లో 3జీ వెర్షన్ 22 వేల రూపాయలకు లభిస్తుంది. ఇది కేవలం వైఫై వెర్షన్ కంటె 3000 రూపాయలు ఎక్కువ. భారత్‌లో వైఫై హాట్‌స్పాట్ లు తక్కువగా ఉండడం, ఉన్న వాటిలోనూ భద్రతకు గ్యారంటీ లేకపోవడం ... పైగా 3జీ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇది మార్కెట్‌లో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.