: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో దద్దరిల్లిన ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో దద్దరిల్లింది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో పోలీసులకు చేతినిండా పని దొరికింది. 'సేవ్ డెమోక్రసీ' పేరిట కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించగా, గాంధీ విగ్రహం ఎదుట 'సేవ్ ఇండియా' పేరిట బీజేపీ ఆందోళన చేపట్టింది. జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ, నరేంద్ర మోదీ, మోహన్ భగత్ కు వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పితే వారిపై కేసులు పెట్టి, లేదా దేశద్రోహుల ముద్ర వేసే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని పేర్కొన్నారు. అనంతరం పార్లమెంటు వరకు సేవ్ డెమోక్రసీ మార్చ్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై దేశం దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఆరోపించింది.