: అజాంఖాన్ పై వివాదాస్పద పోస్టర్లు వేసిన మనోజ్ కుమార్ పాండే


వివాదాస్పద వ్యాఖ్యలతో హల్ చల్ చేసే ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ పై మనోజ్ కుమార్ పాండే అనే వ్యక్తి వివాదాస్పద పోస్టర్లు ముద్రించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే...మూడువారాల క్రితం యూపీలోని బరైపూర్ కు చెందిన మనోజ్ పాండే తన ఎద్దు పోయిందని, అది తమ కుటుంబ సభ్యుడిలాంటిదని పేర్కొంటూ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మూడు వారాలైనా తన ఎద్దు ఆచూకీ కనుక్కోలేకపోయారని పోలీసులపై మండిపడ్డ మనోజ్, అజాంఖాన్ గేదెలు పోగానే 24 గంటల్లో వాటిని వెతికిపట్టుకొచ్చారని పేర్కొన్నారు. ఇక ఆయన తాజాగా ముద్రించిన పోస్టర్లలో అజాంఖాన్ గేదెల ఫోటోల తలల స్ధానంలో అజాంఖాన్ ముఖాన్ని ఫోటోషాప్ చేశారు. దాని కింద...'నువ్వు అధికారంలో ఉన్నావని నీ గేదెలను 24 గంటల్లో వెతికి తెచ్చారు. నేను సామాన్యుడినని 24 రోజులు గడిచినా నా ఎద్దును వెతకలేదు' అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టర్లు సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ ఎదురుగా అతికించడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News