: బొలెరో వాహనాన్ని ఢీ కొన్న మేఘనా ట్రావెల్స్ బస్సు... ఇద్దరి మృతి
గత కొంత కాలంగా జాతీయ రహదారులను ప్రైవేటు బస్సులు రక్తసిక్తం చేస్తున్నాయి. నిన్న రాత్రి హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్తున్న మేఘనా ట్రావెల్స్ బస్సు ఓ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఈ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.