: నా భర్త వంద శాతం కాదు...వెయ్యి శాతం అమాయకుడు: గోవా ఎమ్మెల్యే భార్య
మైనర్ బాలిక కొనుగోలు, నిర్బంధం, అత్యాచారం కేసులో అరెస్టైన బాబూషా మొన్సరేట్ వంద శాతం కాదు వెయ్యి శాతం అమాయకుడని అతని భార్య ఎమ్మెల్యే జెన్నిఫర్ మొన్సరేట్ అన్నారు. పనాజీలో ఆమె మాట్లాడుతూ, పనాజీ సీటు నుంచి తన భర్త పోటీ చేస్తానని ప్రకటించడంతో కక్ష సాధింపు చర్యలు ఆరంభమయ్యాయని ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షసాధింపేనని ఆమె స్పష్టం చేశారు. తన భర్త అలాంటి వ్యక్తి కాదనే చెబుతానని ఆమె తెలిపారు. కాగా, 50 లక్షల రూపాయలు చెల్లించి సవతి తల్లి నుంచి మైనర్ బాలికను కొనుగోలు చేసి, అత్యాచారం చేసినట్టు బాలిక నిన్న పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మానవ అక్రమ రవాణా, కొనుగోలు, నిర్బంధం, అత్యాచారం కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.