: స్మగ్లర్ నుంచి బంగారం కొట్టేసిన ఆర్మీ అధికారి అరెస్టు


దేశరక్షణలో పాలు పంచుకోవాల్సిన ఆర్మీ కల్నల్ అవినీతికి పాల్పడి అరెస్టు అయిన ఘటన దేశ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...2014 డిసెంబర్ లో మయన్మార్ సరిహద్దుల్లో బంగారాన్ని దొంగరవాణా చేస్తున్న సీ లాల్నున్ ఫెలా అనే వ్యక్తి వాహనాన్ని కల్నల్ జాసిత్ సింగ్, మరో ఎనిమిది మంది అడ్డుకున్నారు. తమ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తూనే తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కారులో 14.5 కోట్ల రూపాయల విలువ చేసే 52 బంగారు కడ్డీలు కనిపించాయి. వాటిని తీసుకుని, అతనిని బెదిరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత సీ లాల్నున్ ఫెలా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు. తమకు బంగారం ఎవరూ అప్పగించలేదని పేర్కొని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అక్కడే ఉన్న అసోం రైఫిల్స్ కు చెందిన ఆర్మీ యూనిట్ పై అనుమానం వచ్చిన పోలీసులు గత 24న కేసు నమోదు చేసి, దర్యాప్తుకు సహకరించాలని కోరారు. దీంతో సదరు కల్నల్ యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తమ అనుమానం నిజమని భావించిన పోలీసులు అతనిని, మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News