: ‘అగస్టా’ తీర్పులో సోనియా గాంధీ పేరు!... 225 పేజీల తీర్పు కాపీలో 4 సార్లు ప్రస్తావన
కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మరింత విషమ పరిస్థితి ఎదురయ్యేలానే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో ఆమె పేరు ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా నాలుగు సార్లు ఆమె పేరు ఆ తీర్పు కాపీలో ప్రస్తావనకు వచ్చింది. అగస్టా మాజీ సీఈఓ గుస్పెపీ ఓర్సీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు గతంలోనే ఈ కేసుకు సంబంధించి ఇటలీ కోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా ఈ తీర్పునకు సంబంధించిన కాపీ వెలుగులోకి వచ్చింది. మొత్తం 225 పేజీలున్న ఈ తీర్పులో సోనియా గాంధీ పేరు నాలుగు చోట్ల ప్రస్తావనకు వచ్చింది. తీర్పు కాపీలోని 193, 204 పేజీల్లో సోనియా పేరును సిన్యోరా గాంధీగా జడ్జీ నాలుగు సార్లు ప్రస్తావించారు.