: ఎంపీలపై కేంద్ర మంత్రి గజపతిరాజు ఘాటు వ్యాఖ్య!... వారేమీ సూపర్ సిటిజన్స్ కాదని కామెంట్!


పార్లమెంటు సభ్యుల (ఎంపీలు)పై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీల హోదాలో రాజకీయ నేతలు చూపే డాబూ దర్పాన్ని ప్రశ్నిస్తూ విజయనగరం ఎంపీగా ఉన్న గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. నిన్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎయిర్ పోర్టుల్లో ఎంపీలకు ప్రత్యేక సౌకర్యాల కల్పన, విమానాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన సందర్భంగా గజపతిరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘విమానాశ్రయాల్లో ఎంపీలను ప్రత్యేకంగా చూడటం కుదరదు. ఎంపీలు సూపర్ సిటిజన్సేమీ కాదు. కాబట్టి వారికి సాధారణ పౌరులకు మించి సౌకర్యాలు కల్పించడం కుదరదు. సీట్ల అందుబాటు, ప్రాధాన్యాన్ని బట్టి వాటి కేటాయింపులు ఉంటాయి. అంతేగాని ఎంపీలైనంత మాత్రాన ప్రత్యేకంగా పరిగణించే అవకాశం లేదు. రోగులు, వృద్ధుల విషయంలో మానవత్వంతోనే వ్యవహరిస్తాం. సీట్ల కేటాయింపులో వాణిజ్య కోణమే ఎక్కువగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News