: ధోనీ సేన పుంజుకుంది...జోరుమీదున్న ఢిల్లీని ఓడించింది
ఐపీఎల్ లో నాకౌట్ దశకు బెర్తులు ఖరారు చేసుకుంటున్న కీలక తరుణంలో ధోనీ సేన స్పూర్తిదాయక విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన 33వ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ డుమిని (34), కరుణ్ నాయర్ (32), బిల్లింగ్స్ (24), సంజు శాంసన్ (20), బ్రాత్ వైట్ (20) రాణించడంతో 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పూణేకు ఓపెనర్లు రహానే 63 నాటౌట్, ఖ్వాజా (30) శుభారంభం ఇచ్చారు. దానిని సౌరభ్ తివారీ (21), ధోనీ (27), పెరీరా (14) కొనసాగించడంతో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అజింక్యా రహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో ఈ గెలుపుతో టోర్నీలో విజయాలబాట పడతామని ధోనీ విశ్వాసం వ్యక్తం చేశారు.