: తెలంగాణలో ఇక 24 లేదా 25 జిల్లాలు...జూన్ 2 న ప్రకటన: కేసీఆర్


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పది జిల్లాలను విభజించి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వున్న జిల్లాలు భౌగోళికంగా పెద్దవి కావడం వల్ల, పాలనాపరమైన సమస్యలతో అంచనా వేసిన స్థాయిలో తెలంగాణ అభివృద్ధి పథం వైపు దూసుకుపోవడం లేదని భావించిన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ కు పలు సూచనలు చేశారు. జూన్ 2న కొత్త జిల్లాలపై ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో 24 లేదా 25 జిల్లాలు ఉండనున్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడున్న మండలాలకు తోడు మరో 40 మండలాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై కార్యాచరణ వెంటనే రూపొందించాలని ఆయన సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News