: ఆందోళనల నేపథ్యంలో... ఆచి తూచి మాట్లాడిన చంద్రబాబు!


రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆచితూచి మాట్లాడారు. విజయనగరం జిల్లా సింగవరంలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ చేసిన అసంబద్ధ విభజనతో రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీతో ఫోన్ లో మాట్లాడానని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, మరిన్ని రావాల్సి ఉందని ఆయన చెప్పారు. కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి, మరిన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడుతున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News