: మన దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి: కేంద్ర మంత్రి
మన దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రాజ్యసభకు తెలిపారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు యూజీసీ అందించిన వివరాల ప్రకారం దేశంలో 22 నకిలీ వర్సిటీలు ఉన్నాయని అన్నారు. 1956 యూజీసీ నిబంధనలకు ఇవి వ్యతిరేకంగా ఉన్నాయని ఆమె చెప్పారు. ఢిల్లీలో 5, పశ్చిమ బెంగాల్ లో రెండు, బీహార్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్రల్లో ఒక్కో నకిలీ యూనివర్సిటీ ఉందని ఆమె తెలిపారు. విదేశీ విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు వీలుగా నకిలీ యూనివర్సిటీల జాబితా విడుదల చేయాలని విదేశీ వ్యవహారాల శాఖను కోరుతూ లేఖ రాశామని ఆమె చెప్పారు.