: ఇళ్లలో దొంగతనం చేయడం ఎలా?: పుస్తకం రాసిన దొంగ


64 కళల్లో చోరకళ కూడా ఒకటి. అన్ని కళలకు పాఠశాలలు, గురువులు, పుస్తకాలు ఉన్నాయి. చోర కళకు మాత్రం అలాంటి సదుపాయం లేదు. ఈ లోటును పూరించాలని భావించాడో ఏమో కానీ విశాఖపట్టణంలో పట్టుబడిన దొంగ తిరుపతిరావు... ఇళ్లలో దొంగతనం చేయడం ఏలా? అనే పుస్తకాన్ని రచించాడు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో స్నేహితుడు నరేష్ తో కలసి పలు దొంగతనాలు చేసిన తిరుపతిరావును విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు రాసిన 'ఇళ్లలో దొంగతనం చేయడం ఎలా?' అనే పుస్తకాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, తిరుపతిరావును అరెస్టు చేసిన పోలీసులు, అతని నుంచి 144 గ్రాముల బంగారం, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నరేష్ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News