: హైహీల్స్ చెప్పులు వినియోగం వెనుక అసలు కారణం...!
ఎవరైనా యువతి ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలించాలంటే ఆమె చెప్పుల హీల్స్ ను గమనించాలని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు సమాజంలో తమను తాము ఎలా ప్రతిబింబించుకోవాలనుకుంటున్నారో తెలియాలంటే వారి చెప్పుల హీల్స్ సైజ్ ను గమనించాలని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు. భిన్న నేపథ్యాలు కలిగిన 16,236 మంది మహిళల ఆన్ లైన్ కొనుగోళ్లను విశ్లేషించి ఈ పరిశోధన చేసినట్టు వారు తెలిపారు. హీల్ సైజ్ ఎక్కువ ఉండేలా మహిళలు జాగ్రత్తపడుతుంటే వారు సమాజంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారని అర్థమని వారు చెప్పారు. మధ్యతరగతి, పేద మహిళలు కూడా సంపన్న మహిళల్లా కనపడేందుకు, తమ ఆర్థిక స్థాయిని వేరుగా చూపాలని తాపత్రాయపడుతున్నారని వారు పేర్కొన్నారు. ఆన్ లైన్ ఫ్యాషన్ మార్కెట్ సైతం సంపన్నవర్గంలా కనిపించే వస్తువులను తక్కువ ధరకు అందించి, వినియోగదారులను ఆకట్టుకుంటోందని వారు తెలిపారు. పురుషుల్లో సైతం దుస్తులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, కార్ల వినియోగంలో ఈ అనుకరణను గుర్తించవచ్చని వారు సూచించారు.