: ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది, రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు: చంద్రబాబు
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో పర్యటిస్తోన్న చంద్రబాబు కొద్ది సేపటిక్రితం అక్కడి సింగవరంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోటు బడ్జెట్టు వంటి ఆర్థిక పరిస్థితులు చూసి తానెప్పుడూ భయపడబోనని, ఎటువంటి స్థితినైనా ఎదుర్కొన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం లాభసాటిగా చెయ్యాలని ఆయన అన్నారు. రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షపునీటిని సమర్థంగా వాడుకోవాలని అన్నారు. జలసిరి కింద 16 వేల బోర్లు వేయిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.