: తెలంగాణతో వైరం పెరిగితే రాయలసీమ ప్రాజెక్టులకు ఇబ్బందులు: బైరెడ్డి
తెలంగాణతో వైరం పెరిగితే రాయలసీమలో ప్రాజెక్టులకు ఇబ్బందులు ఏర్పడతాయని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, కృష్ణా డెల్టాకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీక్ష చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఏపీ నేతలు కోస్తాపై చూపిస్తున్న ప్రేమ రాయలసీమపై చూపించడం లేదని ఆయన విమర్శించారు.