: నీట్‌పై సుప్రీంలో వాద‌న‌లు వినిపించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్.. విచారణ రేపటికి వాయిదా


నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్‌) నిర్వహణపై సుప్రీంకోర్టులో ఈరోజు వాద‌న‌లు కొన‌సాగాయి. న్యాయ‌వాదులు రాజీవ్‌ ధావన్‌, కపిల్‌ సిబల్ సుప్రీంకు త‌మ వాదనలు వినిపించారు. త‌క్కువ స‌మ‌యంలో సీబీఎస్‌ఈ సిల‌బ‌స్ కు ప్రిపేర్ అవడం క‌ష్టమ‌వుతుందని న్యాయ‌స్థానానికి తెలిపారు. ఈ ఏడాది నీట్ నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు. నీట్‌పై సుప్రీంలో వాద‌న‌లు వినిపించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్.. తెలుగు మీడియంలో చ‌దువుకున్న విద్యార్థుల‌కు నీట్ ప‌రీక్ష‌ క‌ష్ట‌మ‌వుతుందని సుప్రీంకు విన్న‌వించింది. నీట్ లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులే రాణించ‌గ‌ల‌రని న్యాయస్థానానికి తెలిపింది. నీట్‌తో తమ రాష్ట్రంలోని 60 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది. నీట్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు రేప‌టికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News