: వాడేది ఒకే బల్బు...బిల్లు మాత్రం 74,962!


తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి, మధ్యప్రదేశ్ లో ఓ ఇంటి యజమాని పెద్ద షాక్ కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే...ఎంపీలోని చత్తార్ పూర్ జిల్లాలోని ఓ కుగ్రామంలోని పూరిగుడిసెలో లల్లీ కుష్వాహా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆ పూరి గుడిసెలో ఒకే ఒక్క బల్బు వెలుగుతుంటుంది. ఫ్యాన్, ఇతర విద్యుత్ ఉపకరణాలేవీ అతని ఇంట్లోలేవు. తాజాగా అతనికి గత నెల విద్యుత్ బిల్లును అధికారులు అందజేశారు. ఆ బిల్లు చూసిన కష్వాహాకు కళ్లు తిరిగినంత పనైంది. బిల్లు అక్షరాల డెబ్భైనాలుగు వేల తొమ్మిది వందల అరవైరెండు (74,962) రూపాయలు వచ్చింది. దీంతో అధికారులను ఇదేంటి? అని అడిగితే... 'మహా అయితే ఓ రెండు వేల రూపాయలు తగ్గిస్తాం. మిగిలిన మొత్తం కట్టేయ్ బాబూ' అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఆయన జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News