: ఆర్ధిక పరిస్థితి బాగోలేదు... కేంద్రం సహకరించాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘నీరు-ప్రగతి’ సదస్సులో చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థికపరంగా ఎన్ని సమస్యలున్నా ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో మొదలైన సమస్యలు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. ఎన్ని కష్టాలున్నా రైతుల రుణవిముక్తి కోసం రూ.23500 కోట్లు ఇచ్చామని చెప్పారు.