: విమానానికి సొట్టపడేలా ఢీ కొట్టిన పక్షి


ఓ పక్షి ఢీ కొట్టడంతో విమానానికి సొట్ట పడిన ఘటన భువనేశ్వర్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకుంది. విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన యూకే 309 విమానం 50 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి భువనేశ్వర్ కు బయల్దేరింది. విమానాశ్రయంలో కాసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా, ఈ విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టంది. దీంతో విమానానికి సొట్టపడింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News