: ఏపీకి శుభవార్త...పోలవరానికి వంద శాతం నిధులు కేంద్రమే భరిస్తుంది: ఉమాభారతి
పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి ఉమాభారతి తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఆర్ధికపరమైన అంశాల పట్ల ఆర్థికశాఖతో జలవనరుల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని అన్నారు. 70:30 శాతం నిధుల నిష్పత్తిపై ఆర్థిక శాఖకు, ప్రధాని కార్యాలయానికి వివరణ ఇచ్చామని ఆమె తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించామని ఆమె అన్నారు. ఒడిశా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం చెబుతోందని, ఆ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని, ఇప్పటికే వారికి అన్నీ వివరించామని ఆమె తెలిపారు. మరోసారి వారిని పిలిచి మాట్లాడతామని కూడా ఆమె చెప్పారు.