: ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తిన మనోజ్ బాజ్ పేయ్
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తాడు. ముంబయిలోని జుహు బీచ్ వద్ద ట్రాఫిక్ పోలీసులతో కలిసి మనోజ్ ఒక్కరోజు విధులు నిర్వర్తించాడు. ఇదంతా ఎందుకంటే, తాను నటించిన ‘ట్రాఫిక్’ సినిమా ప్రచార కోసమే! ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా నిలబడిన మనోజ్ ను గుర్తుపట్టిన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, రాజేష్ పిళ్లై దర్శకత్వంలో రూపొందిన ‘ట్రాఫిక్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్రలో మనోజ్ నటించాడు.