: తెలంగాణలో ఓపక్క నీటి ఎద్దడి ఉంది.. మరోపక్క 1512 మిలియన్ లీటర్ల నీరు కంపెనీలకు సరఫరా చేస్తున్నారు!: హైకోర్టులో పిటిషన్
ఓపక్క నీటి ఎద్దడితో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే మరోవైపు మద్యం, కూల్ డ్రింక్ కంపెనీలకు ప్రభుత్వం 1512 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కంపెనీలకు భారీ మొత్తంలో నీరు కేటాయిస్తుండడంతో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కరవు నేపథ్యంలో ప్రజలకు కావలసిన నీళ్లు అందక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మద్యం, కూల్ డ్రింక్ కంపెనీలకు 1512 మిలియన్ లీటర్ల నీళ్లు ఇవ్వడం పట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.