: ఆ వార్త‌లు అబద్ధం... మా వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గురి కాలేదు: రైల్వే అధికారులు


త‌మ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గుర‌యిందంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను రైల్వే అధికారులు ఖండించారు. రైల్వేశాఖ వెబ్‌సైట్ యూజ‌ర్ రిజిస్ట్రేష‌న్ ఫీచ‌ర్ నుంచి ప్ర‌యాణికుల డేటాను హ్యాక‌ర్లు కాజేసిన‌ట్లు మహారాష్ట్ర సైబర్‌ సెల్ పేర్కొన్న నేప‌థ్యంలో ఆ వార్త‌లు నిజం కాద‌ని తెలుపుతూ.. దీనిపై విచార‌ణ చేప‌ట్టామ‌ని వెల్ల‌డించింది. ప్ర‌యాణికుల వ్య‌క్తిగ‌త‌ డేటా వివ‌రాలు హ్యాకర్లు కొట్టేసిన దాఖ‌లాలేమీ క‌నిపించ‌లేద‌ని పేర్కొంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొన్ని కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు. దానిలో నుంచి కోటి మంది యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటాను హ్యాక‌ర్లు అప‌హ‌రించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News