: టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగం ఆలయాలను అనుసంధానించి.. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం, విజయనగరం జిల్లా పర్యటనకు ఆయన బయలుదేరి వెళ్లారు. విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘నీరు-ప్రగతి’ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు.