: అనంతపురం బస్టాండ్ లో ఆత్మహత్య చేసుకున్న బస్సు డ్రైవర్
ఆర్టీసీ డ్రైవర్ రంగనాయకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం బస్టాండ్ లో జరిగింది. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, రంగనాయకులు మృతికి ఉరవకొండ డిపో మేనేజర్ వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని రంగనాయకులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.