: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు... భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపాన్ని తగ్గించాడు. ఉష్ణోగ్రతలు తగ్గాయి. నాలుగు రోజుల క్రితం వరకు మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటకు రావడానికే జంకిన ప్రజలు ఇప్పుడు చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈదురు గాలులతో పడుతోన్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని, భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ వాతావరణం మరో ఐదురోజుల పాటు కొనసాగనుందని పేర్కొన్నారు.