: ఛత్తీస్ గఢ్ లో బ్రిడ్జిపై నుంచి పడిపోయిన బస్సు... 13 మంది మృతి


ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బలరాంపూర్ జిల్లాలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు ఉన్నట్టుండి కిందకు పడిపోవడంతో 13 మంది మృతి చెందగా, 53 మందికి గాయాలయ్యాయి. 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాయ్ పూర్ నుంచి గధ్వాకు వెళుతున్న ఈ బస్సు దాల్ద్ హోవా ఘాటు వద్ద నిన్న రాత్రి ప్రమాదానికి గురైంది. రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను తప్పించబోగా బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి పిల్ల కాలువలోకి పడిపోయినట్టు బలరాంపూర్ పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News