: రాణించిన కోల్ కతా...పంజాబ్ లక్ష్యం 164


ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 32వ మ్యాచ్ ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (54), రాబిన్ ఊతప్ప (70) శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ రనౌట్ కావడంతో యూసఫ్ పఠాన్ (18), ఆండ్రీ రస్సెల్ (16) నాటౌట్ గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు వికెట్లు తీయనప్పటికీ ధారాళంగా పరుగులివ్వకపోవడం విశేషం. కాగా, 164 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టోర్నీపై ఆశలు నిలుపుకుంటుందో లేక గత మ్యాచుల్లోలా పేలవంగా ఇన్నింగ్స్ ముగిస్తుందో చూడాలి!

  • Loading...

More Telugu News