: చనిపోయాడని వైద్యులు చెబితే... అంత్యక్రియల సమయంలో బతికాడు!


కొన్ని సంఘటనలు సైన్సుకు, వైద్య శాస్త్రానికి అందవు. అలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన భాగ్యశ్రీ, నాగోజీ దంపతులు గుజరాత్ లోని భరుచ్ ప్రాంతంలో గత కొంత కాలంగా ఉంటున్నారు. ఆ దంపతులకు మూడు రోజుల క్రిందట పండంటి బాబు పుట్టాడు. అయితే పుట్టుకతోనే బాబుకి శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తడంతో సర్ సాయాజీరావు జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ బాబుకి వైద్యులు వెంటలేటర్ పై చికిత్స అందించారు. చికిత్సకు ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటిలేటర్ తీసేస్తే బాబు మిగలడని తెలిపారు. దీంతో ఆ దంపతులు గుండె దిటవు చేసుకుని, అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అంత్యక్రియల సమయంలో బాబు ఒక్కసారిగా కదలడంతో నాగోజీ హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు బాబును మళ్లీ వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. ఇప్పుడు బాబు బాగున్నాడని, స్వయంగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాడని ఎలాంటి సమస్య లేదని చెప్పి, వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News