: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు నష్టపోయి 25,102 వద్ద ముగియగా, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 7,706 వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ సంస్థ షేర్లు అత్యధికంగా 2.81 శాతం లాభపడి రూ.1,130.50 వద్ద ముగిశాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అరబిందో ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. కాగా, అదానీ పోర్ట్స్ సంస్థ షేర్లు అత్యధికంగా 12 శాతం మేర నష్టపోయి రూ.207.25 వద్ద ముగిశాయి. ఇంకా నష్టపోయిన వాటిలో టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, హిందాల్కో, టాటా స్టీల్ సంస్థల షేర్లు ఉన్నాయి.