: ‘లివింగ్ లెజెండ్’ అమితాబ్ అన్న పిలుపుతో బిగ్ బీ భావోద్వేగం


జాతీయ చలనచిత్రోత్సవ అవార్డుల ప్రదానం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలో తన పేరును ‘లివింగ్ లెజెండ్’ అంటూ ప్రస్తావించడం ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని, మరింత అణకువగా ఉండేలా చేసిందని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. ‘పీకూ’ చిత్రంలో నటనకు గాను అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం అమితాబ్ ఒక ట్వీట్ చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 3.54 గంటలకు ఇంటికి చేరుకున్నామన్నారు. జాతీయ అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. పెద్దల, శ్రేయోభిలాషుల దీవెనలు, వారి ప్రార్థనలు, వారు కురిపించిన ప్రేమను తాను మరవలేనని అమితాబ్ పేర్కొన్నారు. కాగా, ‘లివింగ్ లెజెండ్’ అమితాబ్ బచ్చన్ అంటూ ప్రణబ్ ముఖర్జీ నిన్న తన ప్రసంగంలో అమితాబ్ ను పేర్కొన్నారు. అమితాబ్ ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు స్వీకరించడం ఇది నాల్గోసారి.

  • Loading...

More Telugu News