: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దిగజారిన భారత్...టెస్టు, టీ20ల్లో భేష్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా దిగజారింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించిన టీమ్ ర్యాంకింగ్స్ లో ఈ విషయం వెల్లడైంది. ఈ ర్యాంకింగ్స్ లో టెస్టు, టీ20ల్లో పరువు నిలబెట్టుకున్న టీమిండియా, వన్డేల్లో మాత్రం దిగజారింది. టెస్ట్ క్రికెట్ లో రెండవ ర్యాంకులో కొనసాగుతున్న భారత జట్టు, వన్డేల్లో అగ్రస్థానం నుంచి రెండవ స్థానానికి, అక్కడి నుంచి నాలుగవ స్థానానికి దిగజారింది. టీట్వంటీల్లో వరల్డ్ నెంబర్ టూగా కొనసాగుతోంది. కాగా, టెస్టులు, వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతుండగా, టీ20ల్లో మాత్రం న్యూజిలాండ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వన్డేల్లో టీమిండియా కంటే ముందు ఆసీస్ (ఆస్ట్రేలియా), కివీస్ (న్యూజిలాండ్), ప్రోటీస్ (సౌతాఫ్రికా) జట్లు ఉన్నాయి.