: వ్యాపారస్తులు ఎంపీలవడంతో ప్రత్యేక హోదాపై పోరాడటం లేదు: హీరో శివాజీ


ఏపీకి ప్రత్యేక హోదా అనేది పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, ప్రజలకు సంబంధించినదని సినీ హీరో శివాజీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ప్రకటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్పందించాలని, వ్యాపారులను పార్లమెంట్ కు పంపొద్దని, వ్యాపారస్తులే ఎంపీలుగా వెళ్లడంతో ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదంటున్న విషయమై బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ వైదొలగాలని, రాజీనామాలతో ప్రత్యేక హోదా సాధించుకుందామని శివాజీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News