: బ్రాండెక్స్ కార్మికుల సమస్యలపై దీక్ష చేస్తా.. నెల రోజులు గడువు ఇస్తున్నా: జగన్
బ్రాండెక్స్ కార్మికుల కనీస వేతనం రూ.10వేలకు పెంచాల్సిందేనని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్రాండెక్స్ ఉద్యోగులకు మద్దతు పలుకుతూ ఆయన విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డిమాండ్‌ని అమలు చేయకపోతే కార్మికుల కోసం దీక్షకు దిగుతానని తెలిపారు. వేతనాల పెంపు అమలు కోసం నెలరోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరగాలని, 2011లో జరిగింది కానీ, కార్మికులకు దానివల్ల ప్రయోజనం కలగలేదని అన్నారు. వేజ్‌బోర్డు రివైజ్ చేయించేలా ప్రభుత్వమే చూడాలని అన్నారు. కార్మికుల డిమాండ్లన్నింటినీ నెరవేర్చడానికి తాము అండగా ఉంటామని జగన్ చెప్పారు.