: ఏపీపై జయంత్ సిన్హా ప్రకటన ప్రభావం ఉంటుంది: కంభంపాటి రామ్మోహన్ రావు


ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలపై కేంద్రమంత్రి జయంత్ సిన్హా ప్రకటన ప్రభావం తప్పకుండా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం ఏపీపై ఏ విధంగా ఉంటుందంటూ కంభంపాటిని ప్రశ్నించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. జాబ్ రావాలంటే బాబు రావాలని తాము ఎన్నికలకు ముందు చెప్పామని, ఆ జాబ్ రావాలంటే ఏపీకి పరిశ్రమలు రావాలని, అందుకు కేంద్రం సహాయం కావాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు కేంద్రంపై తాము ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు.

  • Loading...

More Telugu News