: ఏపీకి ప్రత్యేకహోదా లేదు, రాదు: జయంత్ సిన్హా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై నీతిఆయోగ్ ఎలాంటి సూచన చేయలేదని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు నిబంధనల్లో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా గురించి లేదని ఆయన స్పష్టం చేశారు.