: బ్రాండిక్స్ యజమానులతో ప్రభుత్వం కుమ్మక్కైంది, కార్మికులకు అన్యాయం చేస్తోంది: ముఖాముఖిలో జగన్
బ్రాండిక్స్ ఉద్యోగులకు మద్దతు పలుకుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు కార్మికులు బ్రాండిక్స్ యజమానులపై పలు ఫిర్యాదులు చేశారు. తాము రీచ్ కాలేని టార్గెట్‌లు ఇస్తున్నారని కార్మికులు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం తమను తీవ్రంగా వేధిస్తోందంటూ ఓ మహిళా కార్మికురాలు ఫిర్యాదు చేసింది. ముఖాముఖిలో జగన్ మాట్లాడుతూ.. బ్రాండిక్స్ యజమానులతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. బ్రాండిక్స్ లాభాల్లో నడుస్తోన్నా కార్మికులకు కనీస వేతనాలు మాత్రం లేవని అన్నారు. కనీసం రూ.10వేల జీతం చెల్లించాలని కార్మికులు కోరుతున్నారని చెప్పారు. బ్రాండిక్స్ ఇచ్చే జీతాలతో కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. అమెరికా, యూరప్ లలో రూ. లక్షల్లో జీతాలిస్తారని, ఇక్కడ పదివేల కోసం బతిమాడాల్సి వస్తోందని ఆయన అన్నారు.