: వైఎస్ జగన్ కు మరో ఝలక్!... వైసీపీని వీడనున్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
బ్రాండెక్స్ కంపెనీ కార్మికుల వెతలు తీర్చేందుకు బయలుదేరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకి పెట్టని కోటగా మారిన కర్నూలు జిల్లా నుంచి ఆ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ మార్పునకు సంబంధించి ఎస్వీ ఇప్పటికే తన అనుచరులతో చర్చించి ముందడుగు వేసేందుకే నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడితే... జిల్లాలో వైసీపీ బలం టీడీపీ బలం కంటే తగ్గిపోనుంది.