: రెండే అంశాల ఆధారంగా సినిమాను ఎంపిక చేసుకుంటా: ఐశ్వర్యారాయ్ బచ్చన్
సినిమా కథ బాగుండాలి, తన షెడ్యూల్ కు తగిన విధంగా పని ఉండాలనే రెండు అంశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తాను నటించే కొత్త చిత్రాలను ఎంపిక చేసుకుంటానని బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేర్కొన్నారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీతో పాటు హాలీవుడ్ లోనూ నటించిన ఐశ్వర్యారాయ్ చిత్ర రంగంలో తన సుదీర్ఘ ప్రయాణం గురించి మాట్లాడుతూ, తాను పలు చిత్రాల్లో నటించడానికి కారణం భాష, ప్రాంతం అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమేనని అన్నారు. ఒక ఆర్టిస్ట్ గా తాను చిత్రపరిశ్రమలో భాగమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాను ఏ స్థాయిలో తీస్తున్నారనే విషయంలో గందరగోళానికి గురికానని అందాల సుందరి అన్నారు.