: కడప జిల్లాలో స్కార్పియో హల్‌చల్.. భక్తులపైకి దూసుకెళ్లడంతో ఒకరి మృతి
కడప జిల్లాలో వేగంగా దూసుకెళ్లిన ఓ స్కార్పియో వాహనం స్థానికంగా కలకలం రేపింది. అక్కడి అనంతరాజుపేటలోని రహదారి గుండా ఓ స్కార్పియో వేగంగా ప్రయాణించింది. అదే సమయంలో ఆ రోడ్డుపై నుంచి తిరుమల వైపు పలువురు భక్తులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా భక్తులపైకి స్కార్పియో దూసుకెళ్లింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు. స్థానికులు గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.