: జైల్లో ఖైదీ ఫేస్ బుక్ పోస్టింగ్ లతో కలకలం
పశ్చిమ బెంగాల్ లోని బురుద్వాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ ఫేస్ బుక్ పోస్ట్ లు చేస్తున్న ఘటన కలకలం రేపింది. మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో విశాల్ సింగ్ అనే వ్యక్తి గత ఏడాది నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. ఫేస్ బుక్ లో తన ఫొటోలతో పాటు, ఇతర ఖైదీల ఫొటోలను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నాడు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ చేపట్టారు. జైలు భద్రతకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జైలు అధికారులు పేర్కొన్నారు.