: నన్నేమనుకున్నా నో ప్రాబ్లం: ‘క్వీన్’ కంగనా రనౌత్
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ తనను జనం ఏమనుకున్నా సరే నో ప్రాబ్లం అంటోంది. హృతిక్ రోషన్‌తో బ్రేకప్ అయిన తరువాత తనపై వస్తోన్న విమర్శల పట్ల కంగనా తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా మహిళ చలాకీగా ఉంటే ఆమెను వ్యభిచారిణిగా కామెంట్ చేస్తారని, సక్సెస్ సాధిస్తే సైకో అంటారని వ్యాఖ్యలు చేసింది. జనం అంతేనంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంతవరకూ తాను తనకు ఇష్టం వచ్చినట్లే జీవించానని చెప్పింది. మహిళలను ఒక వస్తువుగా ట్రీట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సక్సెస్ సాధించే క్రమంలో చీకటి రోజులు తప్పవని, తనపై వచ్చే విమర్శలను దీటుగా ఎదుర్కుంటానని చెప్పింది. తన మాజీ బాయ్‌ప్రెండ్ హృతిక్ రోషన్ తో చెలరేగుతోన్న వివాదాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొంది. పోరాటం కష్టమైనా.. చీకటి రోజులు ఎల్లకాలం ఉండబోవని హితవు పలికింది.