: నేటి నుంచి తిరుమల భక్తులకు అల్పాహారం కూడా!


తిరుమలలోని భక్తులకు అన్నప్రసాదంతో పాటు ఉచిత అల్పాహారాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందించనుంది. అన్నప్రసాద భవనంలో అల్పాహార వితరణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారం లభించనుంది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, వేసవి రద్దీ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు చెంచు లక్ష్మి, జీఎల్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News